ఎంత గొప్ప ప్రేమ కధ …

857

టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అంటే గుర్తొచ్చే వాళ్ళల్లో అక్కినేని నాగార్జున , అమల ముందు వరసలో ఉంటారు. వివాహమై దాదాపు 26 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ వారు ఎంతో అన్యోన్యంగా ఉంటారు . అయితే తాజాగా ఈ జంట తామ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకున్నారు . ఈ విషయాన్ని ఈ జంట తనయుడు అక్కినేని అఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు . ‘లవ్‌బ‌ర్డ్స్‌తోనూ, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తోనూ ఎంతో అద్భుత స‌మ‌యం. నేను ఎంత‌గానో ప్రేమించే అమ్మానాన్న‌ల‌కు వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు. ఎంత గొప్ప ప్రేమ‌క‌థ‌` అంటూ అఖిల్ ట్వీట్ చేశారు . అదే విధంగా  కుటుంబ స‌భ్యులంద‌రూ క‌లిసి ఉన్న ఫోటోల‌ను కూడా షేర్ చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here