కాపు ఉద్యమనేత , మాజీ మంత్రి తాజాగా ఆసక్తికర ప్రతిపాదనను వెల్లడించారు , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధానాలను మళ్ళీ విమర్శిస్తూ , మరొక ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు . ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతలు ఈ ప్రతిపాదనకు సంబంధించి ముద్రగడ లేఖను పంపారు . ప్రజల ఆస్తులను తన ఆస్తులుగా భావించి సింగపూర్ కంపెనీలకు దానం చేస్తున్నారని , రాష్ట్రాన్ని సింగపూర్ పాలిత ప్రాంతంగా మార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని అందరూ కలిసి రాష్ట్రాన్ని , రైతులను , సామాన్య ప్రజలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ముద్రగడ ఈ లేఖలో పేర్కొన్నారు .

ఎందరో త్యాగధనుల కృషి కారణంగా దేశంలో విదేశీ పాలన పోయిందని , కానీ ఏపీని చంద్రబాబు సింగపూర్ పాలిత ప్రాంతంగా చేయాలని ముద్రగడ విమర్శించారు . అమరావతి భూములను సింగపూర్ కంపెనీలకు ఇస్తామని ప్రకటించిన జూన్ 7 ను ఏపీకి బ్లాక్ డే గా ప్రకటించాలని ఈ లేఖలో పేర్కొన్నారు . టీడీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి జగన్ , పవన్ సహా అన్నీ పార్టీ నేతలు కలిసి ఒకే వేదికపైకి రావలసిన అవసరం ఉందని అన్నారు . చంద్రబాబు పాలనా విధానాలపై యుద్ధభూమిలో తేల్చుకోడానికి వైసీపీ అధినేత జగన్ . జనసేన అధినేత పవన్ ప్రణాళికలు రూపొందించాలని ముద్రగడ అభిప్రాయపడ్డారు . వారిద్దరూ యాత్రలకు కొంత విరామ ప్రకటించి ఈ దిశగా ఆలోచించాలని కోరారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే కమ్యూనిస్టులను కలుపుకుని చంద్రబాబుపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు . ముద్రగడ తాజా ప్రతిపాదనలతో రాజకీయవర్గాలలో చర్చలు నడుస్తున్నాయి …

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments