ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో సభలో మాట్లాడుతూ టీడీపీ నేతలు సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు . అయితే ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు . ఆయన ట్వేట్ చేస్తూ “సహజ వనరులు దోచుకుంటున్నారని ఏ1 అనడం హాస్యాస్పదంగా ఉంది. అసలు ఈ రాష్ట్రంలో మీరు దోచుకోకుండా మిగిల్చింది ఏదైనా ఉందా? ఇసుక, ఖనిజాలు, సున్నపురాయి వంటి ఖనిజ సంపదలను బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లా మింగేశారు” అని ఎద్దేవా చేశారు. 13 ఛార్జిషీట్లలో ఆయన దోచుకున్న మెనూ మొత్తం ఉందని అన్నారు.
జగన్ పై లోకేష్ సెటైర్ …
Subscribe
Login
0 Comments