తాను ముఖ్యమంత్రి కావడం తన తండ్రి దేవేగౌడ కు ఇష్టం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు . ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్ తనకు మద్దతు ఇస్తామని ప్రకటించినా ముఖ్యమంత్రి పదవి మీరో ఉంచుకోండని తన తండ్రి కాంగ్రెస్ నేతలతో చెప్పారన్నారు . అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తననే ఎంచుకున్నారని కుమారస్వామి అన్నారు . తనకు రెండు సార్లు గుండె ఆపరేషన్ అయ్యిందని దేవేగౌడ కాంగ్రెస్ నేతలతో చెప్పారని , ఆరోగ్య సమస్య వల్లనే సీఎం పోస్టును మీరే ఉంచుకోమని కోరారని , అయితే అనూహ్యంగా తననే కాంగ్రెస్ నేతలు సీఎం చేశారన్నారు .

ఇంకా మాట్లాడుతూ తాను ముందుండి ప్రభుత్వాన్ని నడపగలనా అనే భయం వెంటాడుతూనే ఉందని , విధానసభలో ఓ మధ్యవర్తి అధికారుల బదిలీల కోసం రూ . 10 కోట్లు అడుగుతున్నట్లు తెలిసిందని , ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నడపగలమా అని అనిపిస్తోందన్నారు . ఈ విషయం తన తండ్రికి కూడా చెప్పానని కుమారస్వామి పేర్కొన్నారు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments