మెగాస్టార్ చిరంజీవి అల్లుడు , శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసినదే . వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కోర్రిపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది . తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ చిత్రబృందం విడుదల చేసింది . ఈ టీజర్ ను చూస్తుంటే కొడుకు బాగుపడాలని ఆశించే తండ్రి , తండ్రి ఆశలను పట్టించుకోకుండా బలాదూర్ గా తిరిగే కొడుకు చుట్టూ ఈ కదా అల్లుకొని ఉన్నట్టుండి . తనకు నచ్చినట్టు ఉంటూ ఒక యువకుడు ఎలా విజయం సాదిస్తాడనేది ఈ చిత్ర సారాంశం గా కనపడుతోంది . ఈ నెల 24 న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది . ఈ చిత్రం లో కళ్యాణ్ కు జోడీగా మాళవికా నాయర్ నటిస్తుండగా , రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్సకత్వం వహిస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments