కొన్ని సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్ హీరోగా విన్నూతమైన కథతో తెరకెక్కి విజయం సాధించిన సినిమా జాంబ లకడి పంబ , ఈ చిత్రం అందరినీ కడుపుబ్బా నవ్వించింది . ఇప్పుడు అదే టైటిల్ తో మరో చిత్రం తెరకెక్కుతోంది . శ్రీనివాస రెడ్డి , సిద్ధి ఇద్వానీ జంటగా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యింది . ఈ ట్రైలర్ లో కొన్ని డైలాగ్ లను చూస్తుంటే పాత జంబ లకడి పంబ కు కొంచెం దగ్గర గానే ఈ సినిమా కధ ఉన్నట్టు అనిపిస్తోంది . ‘అసలు ఈ మగాళ్ల బాడీలో ఉండటం ఎంత నరకమో తెలుసా’ అని అంటున్నాడు. హీరోయిన్‌ సిద్ధి ఇద్నాని అబ్బాయిలా దుస్తులు వేసుకుని గంభీరంగా కనపడుతూ అలరిస్తోంది. ‘రాత్రి ఓ మేటర్‌ జరిగిందిలే’ అనే డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి . గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి , వెన్నెల కిశోర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు . ర‌వి, జోస్‌, ఎన్‌ శ్రీనివాస‌రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments