వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పశ్చిమ గోదావారి జిల్లాలో ముగించుకొని తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టనుంది . ఈ సందర్భంగా జగన్ కొవ్వురులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గోష్పాద క్షేత్రం చేరుకొని అక్కడ గోదారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు . జగన్ కు గోష్పాద క్షేత్రం వేదం పండితులు సంప్రాదాయ పద్దతిలో స్వాగతం పలికారు . వేద పండితులు వేద మంత్రాలు చదువుతుండగా , జగన్ గోదావరి నదికి హారతి ఇచ్చారు . అనంతరం ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శించుకున్నారు . జగన్ వెంట వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి , జిల్లా ముఖ్య నేతలు ,అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments