కొన్ని రోజుల క్రితం ప్రముఖ టీవీ యాంకర్ లోబో కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ కమెడియన్ , యాంకర్ చలాకి చంటి కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది . వివరాలలోకి వెళితే మహబూబ్ నగర్ 44 జాతీయ రహదారిపై చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుండి మరో కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది . ఈ ప్రమాదంలో చంటి సురక్షితంగా బయటపడ్డారు . అయితే ప్రమాదంలో రెండు కార్లు ద్వంసం అయ్యాయి . విషయం తెలుసుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి అసలు కారణం పై దర్యాప్తు చేస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments