దసరాకు రానున్న మజ్ను …

499

హలో సినిమాతో విజయం అందుకున్న అఖిల్ తన తదుపరి సినిమా తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి తో చేయనున్న విషయం తెలిసినదే . ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు . ఈ చిత్రం మొదటి షెడ్యూల్ యూరప్ లో చిత్రీకరించనున్నారు . ఈ ఫారిన్ షెడ్యూల్ లో ఈ చిత్రానికి సంబందించిన కీలక సన్నివేశాల షూటింగ్ చేయనున్నారు . ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు . అయితే ఈ చిత్రం షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని దసరాకు విడుదల చేయాలని దర్శకుడు వెంకీ అట్లూరి ప్లాన్ చేస్తునట్టు తెలుస్తోంది . అయితే ఈ చిత్రానికి మిస్టర్ మజ్ను అనే టైటిల్ పరిశీలనలో ఉంది . మజ్ను సినిమా నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ సినిమా కావడంతో ఈ టైటిల్ పరిశీలిస్తునట్టు తెలుస్తోంది . ఈ టైటిల్ గురుంచి అక్కినేని అభిమానుల దగ్గరనుండి మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో ఈ టైటిల్ నే ఖారారు చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here