వైసీపీ ఎంపీ వై .వి .సుబ్బారెడ్డి ఈరోజు మీడియా సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు పై నిప్పులు చెరిగారు . ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ అంతా అవినీతిమయం , ముడుపుల మాయ అని ఆరోపించారు . పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబుకు లేదని , కేవలం దోచుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును తీసుకున్నారని ఆరోపించారు . కొత్త నిర్మాణ సంస్థకు నామినేషన్ పై మూడు రెట్లు పెంచి ఇవ్వడం దోచుకోవడంలో భాగమేనని , పోలవరం ప్రాజెక్టు అక్రమాలను కాగ్ వెలుగులోకి తీసుకొచ్చిందని తెలియజేశారు . 2019 లోపు కేంద్రమే పోలవరం ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు . ఇంకా మాట్లాడుతూ పశ్చిమ గోదావారి జిల్లాలో ఎమ్మెల్యేల అవినీతి తారా స్థాయికి చేరుకుందని , రాష్ట్రాభివృద్ధికి చంద్ర‌బాబు అనుభ‌వం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప‌శ్చిమ‌ గోదావరి జిల్లాలో 15 స్థానాల్లోనూ టీడీపీని నెగ్గిస్తే, అందుకు ప్రతిగా చంద్రబాబు ప్రజలను దోచుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments