వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం మల్లవరం లో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం లోక్ సభ స్థానాన్ని బీసీలకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు . పేదలు , బీసీల సంక్షేమం కోసం తన తండ్రి రాజశేఖర రెడ్డి ఒక్క అడుగు వేస్తే , నేను రెండు అడుగులు వేస్తా అని జగన్ అన్నారు . బీసీల సంక్షేమానికి , అభివృద్ధికి డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలిపారు . బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని , వారికి చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ స్పష్టంగా చెప్పారని విమర్శించారు .

ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు బీసీలను వాడుకోవడానికే బాబు పరిమితమయ్యారని అన్నారు . మేనిఫెస్టోలో బీసీలకు ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని చెప్పి నాలుగేళ్లలో కేవలం రూ.13,700 కోట్లు మాత్రమే కేటాయించి మోసగించారన్నారు. రాష్ట్రంలోని 600 బీసీ హాస్టళ్లను మూసేసి, పరోక్షంగా నారాయణ, చైతన్య కళాశాలలకు మేలు చే శారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా నీరుకార్చారన్నారు. పేదలు అభివృద్ధి చెందడం బాబుకు ఇష్టం లేదని, అందుకే వారికి కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఆదరణ పథకంలో ఇస్తున్నారని విమర్శించారు. బడికి పిల్లలను పంపే తల్లిదండ్రులకు రూ.15 వేలు చొప్పున ప్రోత్సాహకం అందిస్తానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here