గత ఏడాది అక్టోబర్ లో అక్కినేని మూడవ తరం కథానాయకుడు నాగచైతన్య , హీరోయిన్ సమంత ల వివాహం జరిగిన విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు తాజాగా సమంత తమ పెళ్ళికి సంబందించిన ఒక వీడియో ను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు . మీకు ప్రామిస్ చేసినట్టుగానే చై-సామ్ పెళ్లిలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఇంత బాగా వీడియో తీసిన జోసెఫ్, రాధిక్ కు ధన్యవాదాలు. దేశంలోనే మీరు బెస్ట్’ అని సమంత చెప్పింది. ఇక, ఈ వీడియోలో నాగచైతన్య పెళ్ళికొడుకు లా తయారవుతూ ‘టై ఎక్కడ..’ అని నవ్వుతూ అఖిల్ ని అడగడం కనబడుతుంది . ‘వీ కెన్ డూ దిస్..వీ కెన్ డూ దిస్’ అంటూ సమంత పాడుతూ డ్యాన్స్ చేయడం గమనించవచ్చు. వీటితో పాటు నాగ చైతన్య-సమంత కలిసి ఉన్న దృశ్యాలు, డ్రమ్ వాయిస్తూ రానా, నాగార్జున-సమంత లు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉండటం ఈ వీడియోలో కనపడుతుంది.

https://www.instagram.com/p/Bj1pp0wnZy8/?utm_source=ig_embed

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments