చంద్రబాబు పై పోసాని ఫైర్ …

520

ప్రముఖ సినీ రచయత , నటుడు పోసాని కృష్ణమురళి ఈరోజు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు . ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కు వెన్నుపోటు పొడిచి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని మండిపడ్డారు . వైసీపీ కు చెందినా 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు సిగ్గు లేకుండా కొనుగోలు చేశారని అన్నారు . ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళు పట్టుకొని విజయవాడకు పారిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు .

వైసీపీ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టని మంత్రి నారా లోకేష్ అంటున్నారని , మరి అలాటప్పుడు చంద్రబాబు మొన్నటి వరకు బీజేపీ తో దోస్తీ చేయలేదా అని నిలదీశారు . తన రాజకీయ అవసరం కోసం ఎవరి కళ్ళు అయినా పట్టుకునే చంద్రబాబు ఎంత వగలాడో ప్రతేయకంగా చెప్పనక్కర్లేదని పోసాని అన్నారు . ఎన్టీఆర్ కు విలువలు లేవని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు . ఎన్టీఆర్ కుటుంబసభ్యులు చంద్రబాబు వ్యాఖ్యలను కచ్చితంగా ఖండించాలని లేకపోతే ఎన్టీఆర్ కు నిజంగా విలువలు లేవనే భావన ప్రజల్లోకి వెళుతుందన్నారు .

ఇంకా మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి తెచ్చుకోనాన్ని స్టేలు చంద్రబాబు తెచ్చుకున్నారని , వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని మండిపడ్డారు . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వాడుకున్న చంద్రబాబు నేడు అవసరం తీరక ఆయన పై విమర్శలు చేస్తున్నారన్నారు . కమ్మ కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు . చంద్రబాబు అవసరానికి ఎవరితోనైనా దోస్తీ కడతారనని , గతం లో ప్రధాని వాజీపేయ్ తో కలిసి దాని తరువాత ఆ పార్టీ కి విలువలు లేవన్న విషయాన్ని గుర్తు చేశారు .

ప్రతిపక్ష నేత జగన్ గురుంచి మాట్లాడుతూ రాజకీయాలకు సీనియారిటీ అవసరం లేదని , జగన్ ఏ విషయమైనా స్పష్టంగా మాట్లాడతారన్నారు . జగన్ కు ప్రజలు ఏమి చేస్తే మంచిదో బాగా తెలుసునని ఆయనకు ఏమి చేయాలో బాగా స్పష్టత ఉందన్నారు .  ఒక వోటర్ తన ఓటు జగన్ కే నని స్పష్తం చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here