ఆర్టీసీ కార్మికులతో జరిపిన చర్చలు స్ఫలమైన నేపధ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియా తో మాట్లాడుతూ చర్చలు సఫలమయ్యేటట్లు సహకరించిన కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానాని అన్నారు . కార్మిక పక్షపాతిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు . ఇంకా మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావుకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఎందుకంటే టీఎంయూకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్ రావు అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాలకు మధ్యవర్తిత్వం వహించారని, ద్విపాత్రాభినయం చేశారని నవ్వుతూ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేసీఆర్‌తో చర్చించామని, భవిష్యత్తులో తాము చేయనున్న కొన్ని సంస్కరణలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments