లోక నాయకుడు కమల్ హసన్ ప్రధాన పాత్రలో కొన్ని సంవత్సరాల క్రితం విశ్వరూపం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది . అప్పటి నుండి ఈ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో పడ్డారు కమల్ . కానీ ఇప్పటికి ఆ చిత్రం సీక్వెల్ విశ్వరూపం 2 విడుదలకు సిద్ధంగా ఉంది . ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తిచేసుకున్నా కొన్ని ఇబ్బందుల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది . ఇప్పుడు ఆ అడ్డంకులు అన్నీ తొలగిపోయి ఈ ఆగష్టు 10 న విశ్వరూపం ౨ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది .

తాజా ఈ చిత్ర ట్రైలర్ వివిధ బాషలలో విడుదల చేశారు . తమిళ్ ట్రైలర్ ను శ్రుతి హాసన్ , హిందీ ట్రైలర్ ను అమీర్ ఖాన్ , తెలుగు ట్రైలర్ ను ఎన్టీఆర్ విడుదల చేశారు . యాక్షన్ , ఎమోషన్ , రొమాంటిక్ సీన్స్ లోని కొన్ని ముఖ్యభాగాలను  ఈ ట్రైలర్ లో పొందు పరిచారు . ఈ ట్రైలర్ ను చూస్తే భారీతనం ప్రతిబింబిస్తోంది . మరి ఈ సీక్వెల్ తో కమల్ విశ్వరూపం విజయాన్ని కొనసాగిస్తారని అనిపిస్తోంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments