లెజెండరీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ డెబ్యూ మూవీ ధడక్‌ ట్రైలర్‌ వచ్చేసింది. ఇషాన్‌ ఖట్టర్‌, జాన్వీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంక్‌ ఖైటన్‌ దర్శకత్వం వహిస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్నారు.

‘ఎప్పుడైతే రెండు వేర్వేరు ప్రపంచాలు కలుస్తాయో.. అవి ఒక్కటిగా మారిపోవటం ఖాయం’  అంటూ దఢక్‌ కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. మధుకర్‌, పార్వతి పాత్రల్లో ఇషాన్‌, జాన్వీలు అలరించనున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ, సరదా సన్నివేశాలు, రొమాంటిక్‌ లైఫ్‌… అంతా సజావుగా సాగిపోతున్న వేళ… వారి కుటుంబాలు అడ్డుతగలటం, ఎమోషన్స్‌ సన్నివేశాలు, ప్రేమను బతికించుకునేందుకు దూరంగా పారిపోవటం తదితర అంశాలతో ట్రైలర్‌ ను కట్‌ చేశారు. మరాఠీ హిట్‌ సైరాట్‌కు రీమేక్‌ కావటం, విషాదాంత కథాంశం అయినప్పటికీ… ధడక్‌పై బాలీవుడ్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి. జూలై 20న దఢక్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments