నిన్న న్యాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా బిగ్ బాస్ 2 రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమయ్యింది . మొత్తం హౌస్ లో 13 మంది సెలెబ్రిటీలు ఉండగా , 3 మాత్రం సామాన్యులు ఉన్నారు . వీరిలో విజయవాడ కు చెందిన గణేష్ , మోడల్ సంజన అన్నే , విసఖపత్నానికి చెందినా నూతన్ నాయుడు ఉన్నారు . అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అందరూ ఎంటరైన తరువాత సామాన్యులను సెలెబ్రిటీలు షాక్ కు గురి చేశారు . అందరూ హౌస్ లో స్తిమితపడ్డాక హౌస్ లో నుండి బయటకు పంపేందుకు ఇద్దరినీ ఎంచుకోవాలని బిగ్ బాస్ సూచించడంతో సెలెబ్రిటీలు అందరూ సామాన్యులపై పడ్డారు . సంజన ,నూతన్ నాయుడు పేర్లు సూచించడంతో వారు షాక్ అయ్యారు . సూచించిన ఇద్దరినీ బిగ్ బాస్ ఆదేశాల మేరకు జైలులో బంధించారు . కాగా ఈ విషయం పై సంజన అంత మంది సెలెబ్రిటీలు ఉండగా తమ పేర్లే సూచించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు . దీంతో తొలిరోజు షో వివాదం తో సాగింది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments