షాకింగ్ : జగన్ పాదయాత్రలో బాలకృష్ణ ఫ్లెక్సీ ….

741

వైఎస్ఆర్సీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాసంకల్పయాత్ర లో ఒక ఆశ్చర్యకర విషయం చోటుచేసుకుంది . ఈ యాత్రలో ప్రముఖ కధానాయకుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీ ను ఏర్పాటు చేయడం చర్చనీయాంసమైంది . ఒకే ఫ్లెక్సీ లో ఒక వైపు వై ఎస్ జగన్ , రెండో వైపు వై ఎస్ రాజశేఖర రెడ్డి , మూడవ వైపు నందమూరి బాలకృష్ణ ఫోటో ఉండడం విశేషం . పాదయాతలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు , జగన్ అభిమానులు , ప్రజలు ఈ ఫ్లెక్సీ ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు . ఈ విషయం పై మీడియా ఆరాతీయగా ఒక ఆసక్తికర విషయం వెలువడింది , పశ్చిమగోదావరి జిల్లా మల్లవరం కు చెందిన వైసీపీ కార్యకర్త ఈ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారని , నందమూరి బాలకృష్ణ కు అతను వీరాభిమాని అని స్థానికులు తెలిపారు ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here