బీజేపీ కి షాక్ ఇచ్చిన సొంత సర్వే …

528

ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీల నుండి జాతీయ పార్టీల దాకా వారి బలాన్ని తెలుసుకోవడానికి అంతర్గత సర్వేలు నిర్వహిస్తుంటారు . ఇప్పుడు తాజాగా బీజేపి నిర్వహించుకున్న బీజేపీ సర్వేలో బీజేపీ కి ఎదురు దెబ్బ తగిలింది . గత ఎన్నికలలో గెలిచిన 282 ఎంపీ స్థానాలలో 152 నియోజకవర్గాలలో ప్రజలు బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది . దీంతో బీజేపీ అధిష్ఠానం వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలలో ఇప్పుడు ఉన్న సిట్టింగ్ అభ్యర్థులను కాకుండా కొత్త వారిని పోటీలోకి దించాలని యోచిస్తోందని సమాచారం . ఈ కొత్త అభ్యర్థుల ప్రయోగాన్ని బీజేపీ ఢిల్లీ లో జరిగిన మూడు నగరపాలక సంస్థల ఎన్నికలలో అమలు చేసి విజయం సాధించింది . అందువల్లనే రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఈ కొత్త అభ్యర్థుల ప్రయోగం మళ్ళీ చేసి బీజేపీ విజయం సాధించాలనుకుంటోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here