‘యన్.టి.ఆర్’ ఫస్ట్ లుక్ విడుదల

0
344

యుగపురుషుడు ఎన్టీఆర్ జీవిత కదా ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యన్ .టీ .ఆర్ . నటసింహం నందమూరి బాలకృష ముఖ్యపాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతోంది . ఈరోజు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు ‘తన నూరవ చిత్రంలో అమ్మ పేరు ధరించి కూస్తంత మాతృరుణం తీర్చుకున్న బసవ రామ తారక పుత్రుడు, ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృరుణాన్ని కూడా తీర్చుకుంటున్న తారక రామ పుత్రుడు, శతాధిక చిత్ర ‘నటసింహం’, నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని ‘యన్.టి.ఆర్’ చిత్ర దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ నటించిన వివిధ చిత్రాల్లోని పాత్రలతో పాటు అవే పాత్రల్లో బాలకృష్ణను చూపించారు. ఈ ఫస్ట్ లుక్ లో బాలకృష్ణ మీసాలను ఆయన తండ్రి ఎన్టీఆర్ దిద్దుతున్నట్టు చూపించడం ఆసక్తికరంగా ఉంది. ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని వారాహి చలన చిత్ర సంస్థ, బాలకృష్ణ సంయుక్తంగా రూపొందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here