నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు . ఈ మేరకు బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ నారా లోకేహ్ ట్వీట్ చేశారు . ఆయా ట్వీట్ చేస్తూ “నటసింహం ” బాల మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు , లెజెండ్ యన్ .టీ .ఆర్ పై నిర్మిస్తున్న బయోపిక్ లో మిమ్మల్ని ఎన్టీఆర్ పాత్రలో ఈ ఏడాదిలో చూసేందుకు ఎదురుచూస్తున్నా అని అన్నారు .

కాగా, బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సీనియర్ నటుడు నరేష్, నందమూరి కల్యాణరామ్ తదితరులు తమ విషెస్ తెలిపారు. ఈ ఏడాది బాలయ్య బాబు జరుపుకుంటున్న బర్త్ డే ఎంతో ప్రత్యేకమైందని, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ‘యన్.టి.ఆర్’ బయోపిక్ చూడాలని ఆతృతగా ఉందని నరేష్ తన ట్వీట్ లో అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విడుదల చేసిన ‘యన్.టి.ఆర్’ ఫస్ట్ లుక్ ను ఆయన జతపరిచారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments