మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసినదే . ఇటీవల ఆయన చిత్రానికి విజేత అనే టైటిల్ ను పెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన విషయం కూడా తెలిసినదే . ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా మాళవికా నాయర్ నటిస్తున్నారు . అయితే ఇప్పుడు ఈ చిత్రం గురుంచి ఆసక్తికర విషయం వెలువడింది . ఈ నెల 24 వ తేదీన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరగనుండగా ముఖ్య అతిథిలుగా మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేయనున్నారని సమాచారం . అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు . ఇదే కనుక జరిగితే తన మొదటి సినిమా విజేత కే మంచి ప్రమోషన్ లభించి కళ్యాణ్ దేవ్ విజేత అవుతారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here