బాబు సంస్కార హీనుడు …

0
161

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన తొలిసారి రాష్ట్ర కార్యవర్గం విజయవాడలో భేటీ అయ్యింది . ఈ కార్యక్రమంలో ఎంపీ హరిబాబు , శాసనసభా పక్షనేత విష్ణు కుమార్ రాజు , ఎమ్మెల్సీ సోము వీర్రాజు , పురందరేశ్వరి తదితరులు హాజరయ్యారు . ఈ సమావేశం రాష్ట్రంలో ప్రష్టుటం నెలకొన్న రాజకీయ పరిణామాల గురుంచి చర్చించారు . అనంతరం కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ బీజేపీ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు . వైసీపీ , జనసేనతో సంబంధాలు అంటగట్టాలని చంద్రబాబు చూస్తూ అదే ప్రస్తుత ఎన్నికల ఎజెండా గా ఆయన వ్యవహరిస్తున్నారనున్నారు . చంద్రబాబు సంస్కార హీనుడని , వ్యక్తిగత దూషణలు ఆయన నైజామని కన్నా విమర్శలు చేశారు . స్టాక్‌ బ్రోకర్‌గా అనేక మందిని మోసం చేసిన వ్యక్తి కుటుంబరావు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాక హత్య కేసులో ముద్దాయి, మోసాలు చేసేవారు కూడా ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నారని కన్నా మండిపడ్డారు . ఇలాంటి వారిని సీఎం ప్రోత్సహిస్తున్నారని చురకలు అంటించారు. బాబు ఎన్నికుట్రలు పడిన వాటిని తిప్పి కొడతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్పారు . రాష్ట్రంలో బీజేపీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ జూన్‌11వ తేదీన విజయవాడలో ధర్నాకు దిగుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here