ఆయన ఎటువంటి సందేశం ఇస్తున్నారు …

505

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి బీజేపీ పై నిప్పులు చెరిగారు . ఆయన తాజాగా అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందని అన్నారు . గత ఎన్నికలలో బీజేపీ తో పొత్తు పెట్టుకోకుంటే తమకు మరో 20 స్థానాలు వచ్చేవని అన్నారు . విభజన హామీల అమలు కోసం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు .

బీజేపీ పార్టీ అవినీతిపరులతో కలిసి ఏపీని దెబ్బతీయాలని చూస్తోందని మండిపడ్డారు . స్విస్ బ్యాంకులోని నల్లధనం మొత్తాన్ని తీసుకువస్తానన్న మోడీ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి , జగన్ లాంటి వారిని పక్కన పెట్టుకొని దేశ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here