బీజేపీ పైనా , తలైవా రజనీ పైనా ఆరోపణలు చేస్తున్న కోలీవుడ్ దర్శకుడు అమీర్ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు . కోవై లోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన రాజకీయ చర్చా వేదికలో ఈ ఘటన చోటుచేసుకుంది . ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసాయ్ సౌందర్ రాజన్, కొంగు ఇళంజర్ పేరవై నిర్వాహకుడు తనియరసు తదితరులు పాల్గొన్నారు .

అసలు విషయం ఏమిటంటే ఆ కార్యక్రమంలో అమీర్ మాట్లాడుతుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డు తగిలారు . ఈ వ్యవహారం కాస్తా ముదరడంతో నిర్వాహకులు అమీర్ ను అక్కడి నుండి ఆయన బస చేసిన హోటల్ కు పంపించేశారు . బీజేపీ కార్యకర్తలు అంతటితో ఆగకుండా ఆ రాత్రి కొంగు ఇళంజర్ పేరవై నిర్వాహకులు కారులో కరుమత్తంపట్టి గ్రామానికి బయలుదేరగా ఆ కారులో దర్శకుడు అమీర్ ఉన్నట్టుగా అనుమానించి కారును అడ్డగించి రాళ్లు , గడ్డపారతో దాడి చేశారు . కారు అద్దాలు పగిలిపోవడంతో ప్రయాణికులు కారులో నుంచి దిగగా వారిలో దర్శకుడు లేకపోవడంతో బీజేపీ కార్యకర్తలు అక్కడి నుండి జారుకున్నారు . ఈ విషయంపై పేరవై నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments