బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు రెండోవ సీజన్ కు రెడీ అయ్యింది . ఈరోజు మొదలు కానున్న ఈ షో కు నాని హోస్ట్ గా వ్యవహరించనున్నారు . ఈ షో లో మొత్తం 16 మంది పాల్గొంటారు , 100 రోజుల పాటు ఈ షో సాగనుంది . స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ షో లో పాల్గొనే వారి పేర్లు ఇదేనంటూ గతంలో కొన్ని పేర్లు బయటకు వచ్చాయి . ఇప్పుడు మళ్ళీ మరొక జాబితా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది .

ఆ జాబితా ప్రకారం నటి రాశి, సింగర్ గీతా మాధురి, దీప్తి సునయన, యాంకర్ శ్యామల, టీవీ9 యాంకర్ దీప్తి, ధన్య బాలకృష్ణ, నటి గజాలా, నటి శ్రీదేవి, నటి/యాంకర్ వర్షిణి సౌందేరాజన్, నటులు రాజ్ తరుణ్, వరుణ్ సందేశ్, తనీష్, ఆర్యన్ రాజేశ్, యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ కాకుమాను, జూనియర్ ఆర్టిస్ట్/కమెడియన్ వేణు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు . మరి ఇది ఫైనల్ లిస్టో కాదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడక తప్పదు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments