వర్మకు దిమ్మతిరిగే షాకిచ్చిన అఖిల్ …

449

ఎప్పుడూ తన ప్రవర్తనతో , స్టేట్మెంట్లతో అందరికీ షాకిచ్చే రామ్ గోపాల్ వర్మకు అక్కినేని యువ కథానాయకు డు అఖిల్ దిమ్మతిరిగే షాకిచ్చారు . విషయానికి వస్తే ఆఫీసర్ షూటింగ్ సమయంలో రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రం అఖిల్ తో చేయనున్నారని అనేక వచ్చాయి . అయితే దాని తరువాత ఆఫీసర్ సినిమా చిత్రీకరణ పూర్తయి విడుదల అవ్వడం , ఎప్పుడు లేనంతగా నాగార్జున కెరీర్ లో డిసాస్టర్ గా నిలవడం చకచకా జరిగిపోయాయి . అయితే తాజా అఖిల్ ను ఒక రిపోర్టర్ వర్మ దర్శకత్వంలో చేయబోయే తన తదుపరి చిత్రం గురుంచి ప్రశ్నించగా అఖిల్ మాట్లాడుతూ ” ఈ వార్తల్ని ఎవరు నిర్ధారించారో నాకు తెలియదు. ఎందుకిలా చేస్తారు.? నా తర్వాత చిత్రం కోసం లండన్ వెళ్లబోతున్నా. ఇప్పుడు నా మైండ్‌లో కేవలం అదే ఉంది” అని ఆయన అన్నారట. అయితే ఈ విషయం తెలిసి అఖిల్ వర్మకు సరైన సమాధానం ఇచ్చారని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు . ఇటీవల అక్కినేని అభిమానులు వర్మ కటౌట్ కు పాలాభిషేకం చేసి ఇక మీదట అక్కినేని హీరోలతో సినిమాలు చేయొద్దన్న విషయం తెలిసినదే .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here