అందుకే చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు …

0
165

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రలో భాగంగా యలమంచిలి లో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ డిగ్రీ ,పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు కూడా ఆదాయం లేక డబ్బుకోసం చెడుదారులు పడుతూ ఉన్నారన్నారు . అందుకు ప్రభుత్వాలు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడమే   కారణమని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు . జనసేన పార్టీ లోకి ఎక్కువగా యువకులు వస్తుండడంతో భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిరుద్యోగ భృతి అమలు చేస్తామంటున్నారని పవన్ తెలిపారు . ఆ నిరుద్యోగ భృతి కూడా అందరికీ కాదని డిగ్రీలు చదువుకొని ఉండాలని , మరెన్నో నిభందనలు పెట్టారన్నారు . కాగా, ప్రజా సమస్యలు ప్రస్తావించడానికే తాను సినిమాలు విడిచిపెట్టానని అన్నారు. జన్మభూమి కమిటీలు ప్రజల్ని మభ్యపెడుతూ దోపిడీ చేసే కమిటీలుగా ఉన్నాయని అన్నారు. బీజీ కార్పొరేషన్‌ నుంచి రుణాలు రావాలంటే తెలుగు దేశం పార్టీ జెండాలు పట్టుకోవాలని నీచంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇటువంటి పనులు చేసే తెలంగాణలో టీడీపీని లేకుండా చేశారని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here