జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటయాత్ర లో భాగంగా విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో పర్యటించి ఆ తరువాత అక్కడ జరిగిన రోడ్ షో లో మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలలో పాలక , ప్రతిపక్ష వర్గాలు దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు . ఒక పార్టీ దోపిడీ చేస్తే మరో పార్టీ నిలదీయరని అందుకే మూడో ప్రత్యామ్నాయ పార్టీ ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు . రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మార్పులు చూస్తుంటే 2019 లో కచ్చితంగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు . వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటూ , చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న మైనింగ్ మీద స్థానిక ఎమ్మెల్యే రోజుకు రూ . 6 లక్షలు సంపాదిస్తున్నా వారిపై కేసులు పెట్టరని అన్నారు . ప్రజల తరపున మాట్లాడడానికే జనసేన ఉందని మరోసారి పవన్ స్పష్టం చేశారు .

టీడీపీ వ్యాఖ్యలను తిప్పికొడుతూ తాము ఎప్పుడు చూసినా 17,000 కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారని , చూస్తేనేమో కనీసం రైల్వే బ్రిడ్జి కూడా వేయలేదని , ఇంకెప్పుడు వేస్తారని పవన్ ప్రశ్నించారు . రైల్వే బ్రిడ్జి ను పట్టించుకోక ఆ ప్రదేశం మందుబాబుల అడ్డాగా తయారయ్యిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు . కనీసం విశాఖపట్నం రైల్వే జోన్ వస్తే ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశించినా దాన్ని సాధించడంలో కూడా రాష్త్ర ప్రభుత్వం విఫలమయ్యిందని అన్నారు . ఇంకా మాట్లాడుతూ తాను యువతకు అండగా ఉందామని రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు . గత ఎన్నికలలో ఏమీ ఆశించకుండా తాను టీడీపీ మద్దతు తెలిపానని , తనకు ఎం చేస్తారని ఏనాడు టీడీపీ ప్రభుత్వాన్ని అడగలేదని , రాష్ట్ర యువతకు ఏంచేస్తారని అడుగుతున్నానని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments