ఇటీవల మంచు మనోజ్ , భార్య ప్రణతికి మధ్య మనస్పర్థలు తలెత్తాయని , వారు విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వార్త ట్రెండ్ అవుతోంది . అయితే ఈ విషయం పై హీరో మంచు మనోజ్ ఒక క్లారిటీ ఇచ్చారు . తాజాగా ఆయన తన అభిమానులతో ట్విట్టర్ లో చాట్ చేశారు . అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చారు . ఈ సందర్భంలో ఒక అభిమాని “మీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి ? మీ భార్య ప్రణతి గురుంచి మీ అభిప్రాయమేంటి ?” అని అడగగా మనోజ్ దీనికి బదులుగా “వాళ్ళ బొంద . ప్రణతి నా దేవత ” అని ఒక్క ముక్కలో సమాధానం చెప్పి రుమౌర్స్ ను బ్రేక్ చేశారు .

ఇదే సమయంలో ఇంకొక అభిమాని ట్వీట్ చేస్తూ తనకు ఒక రిప్లై ఇవ్వాలని , రిప్లై కోసం చూసీ చూసీ కోపంతో ఫోన్ పగలగొట్టేలా ఉన్నానని అనగా , దానికి మనోజ్ సమాధానంగా “నో కోపం … లవ్యూ ‘ అని పేర్కొన్నారు . ఇంకొక అభిమాని ట్వీట్ చేస్తూ కులం పేరుతో కొందరు రాజకీయ నాయకులు మన దేశాన్ని విభజించాలని చూస్తున్నారని , దీనిపై మీ స్పందన మీ అభిప్రాయమేంటని అడగగా “మన కర్మ … బ్రిటిషర్లు మనకు డివైడ్ అండ్ రూల్ పాలసీ బాగా నేర్పించి వెళ్లారు ” అని మనోజ్ పేర్కొన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments