జక్కన రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసినదే . అప్పటి నుండి ఎన్టీఆర్ ,చెర్రీల మధ్య ఉన్న స్నేహాన్ని ఫోటోల ద్వారా చూస్తున్నాం . అయిత్ తాజాగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటోను షేర్ చేశారు . యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో కింద రామ్ చరణ్ కూర్చుని ఉన్న స్టిల్ ఇది . ఎన్టీఆర్‌ ఫోటో వైపు చూస్తూ ఫోజు ఇచ్చిన చెర్రీ ఫోటోను పోస్ట్‌ చేసిన తారక్‌ ‘మహానుభావుల ఆలోచనల నుంచి ప్రేరణ’ అంటూ ఓ కాప్షన్‌ ఉంచాడు . ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ చిత్రాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక #RRR మొదలయ్యే అవకాశం ఉంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments