సికింద్రాబాద్ లోని రాణిగంజ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మూడంతస్తుల భవనంలో ఉన్న ఏషియన్ పెయింట్స్ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గోదాంలోని పెయింట్ డ్రమ్ములు పేలిపోతుండటంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్ గోదాంకు పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ వస్తువుల గోదాంకూ మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి.

అయితే, చిన్న గల్లీలో ఈ గోదాం ఉండటంతో అక్కడికి అగ్నిమాపక యంత్రాలు వెళ్లడం కష్టసాధ్యంగా మారింది. దీంతో, దూరం నుంచి మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న నివాస గృహాలు, దుకాణాలకు కూడా మంటలు వ్యాపిస్తాయేమోనని స్థానికులు భయపడుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా. కాగా, రైల్వేట్రాక్ కు పక్కనే ఈ గోదాం ఉండటంతో ఆ మార్గంలో వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments