దమ్ముంటే రోడ్లపైకి వచ్చి మాట్లాడాలి …

716

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రమంతా ప్రతీ జిల్లాలో నవనిర్మాణ దీక్షలు దీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే . అలాగే అనంతపురంలో నవనిర్మాణ దీక్ష నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో టీడీపీ తో పొత్తుతో బీజేపీ రెండు లోక్ సభ సీట్లు గెలిచిందని ఈ సారి ఒక్క సీటు కూడా బీజేపీ గెలవదని జోస్యం చెప్పారు . ఇంకా మాట్లాడుతూ కొంతమంది బీజేపీ నేతలు తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు . నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడడం కాదని , దమ్ముంటే రోడ్లపైకి వచ్చి మాట్లాడాలని , ప్రజలు తమ సత్తా చూపుతారని బాలకృష్ణ బీజేపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here