హైదరాబాద్ లో ఈరోజు రాత్రి సుమారు గంటపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్న నేపథ్యంలో రాత్రి 8.20 గంటల నుంచి రాత్రి 9.10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండే ప్రాంతాల వివరాలు..

బేగంపేట ఎయిర్ పోర్టు, పీఎన్ టీ జంక్షన్, శ్యాంలాల్ బిల్డింగ్, హెచ్ పీఎస్, బేగంపేట ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, సీఎం క్యాంపు కార్యాలయం, పంజాగుట్ట ఫ్లై ఓవర్, ఎన్ఎఫ్ సీఎల్ గ్రేవ్ యార్డ్, శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్, సాగర్ సొసైటీ టీ జంక్షన్, ఎన్టీఆర్ ట్రస్టు భవన్, కేబీఆర్ పార్కు, క్యాన్సర్ ఆసుపత్రి, టీఆర్ఎస్ భవన్ రోడ్డు, ఒరిస్సా ఐ ల్యాండ్, బంజారాహిల్స్ రోడ్డు నెం.12 ఉపరాష్ట్రపతి నివాస ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయి.

కాగా, గవర్నర్ నరసింహన్ రేపు రాజ్ భవన్ లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాజ్ భవన్ మార్గంలో వాహనాల రాకపోకలను నిషేధించినట్టు పోలీసులు తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments