చంద్రబాబునాయుడు నాలుగేళ్ళ పాలనపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక సర్వే జరిపిందా ? మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చంద్రబాబుకు పెద్ద షాకే తగిలింది. దినపత్రికి వివిధ అంశాలపై రాష్ట్రంలో సర్వే నిర్వహించిందట. వచ్చే ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తారని అడిగిన ప్రశ్నకు 42 శాతం మంది జగన్ కే ఓటేస్తామన్నారట. తమ ఓటు చంద్రబాబుకే అన్నవాళ్ళు 30 శాతమేనట. పవన్ కల్యాణ్ కు 19 శాతం మంది మద్దతిచ్చారు.
చంద్రబాబు పాలనపై జనాల అభిప్రాయం కోరగా ఏమీ బాగోలేదని 57 శాతంమంది అభిప్రాయపడ్డారట. చంద్రబాబు పాలన బాగుందన్న వారి శాతం 16 మాత్రమే. మిగిలిన వారు పెద్దగా సంతృప్తిగా లేదనే చెప్పారట. పనిలో పనిగా చంద్రబాబు అనుభవం రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదని 58 శాతం అభిప్రాయ పడ్డారట. అంటే దేశంలో తానే అందరికన్నా సీనియర్ ను తానే అని చెప్పుకుంటున్న చంద్రబాబుది కేవలం సొంతడబ్బా అని తేలిపోయింది.
ఇక, అంత్యంత కీలకమైన ప్రత్యేకహోదా విషయానికి వస్తే హోదా సాధనలో చంద్రబాబు ఫెయిలయ్యారని 76 శాతం మంది అనుకుంటున్నారట. నాలుగేళ్ళలో అవినీతి పెరిగిపోయిదని అనుకుంటున్నవారి శాతం 64 అట. చంద్రబాబు పాలనలో కొట్టచ్చినట్లు కనబడిన ఫిరాయింపులను 80 శాతం మంది అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారట. ఇలా చంద్రబాబు పాలనకు సంబంధించిన ప్రతీ అంశంలోనూ జనాల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం స్పష్టంగా బయటపడింది. సో, రేపు ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కానీ లేకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో గానీ జనాల తీర్పు ఎలా ఉండబోతోందో కొంత వరకూ అంచనా వేసుకోవటానికి ఉపయోగపడుతుందన్న మాట.