కమెడియన్ గా సునీల్ ఒక్క రోజు పారితోషకం ఎంతో తెలుసా…

0
210
కమెడియన్ గా సునీల్ చాలా బిజీగా వున్న సమయంలో ఆయన హీరోగా అవకాశాలు వచ్చాయి. హీరోగా రెండు మూడు సినిమాలు ఆయనని నిలబెట్టేశాయి. దాంతో కమెడియన్ వేషాలకి బై చెప్పేసి హీరోగానే తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు. అయితే హీరోగా ఆయనను వరుస పరాజయాలు పలకరిస్తూ వచ్చాయి. ఒక్క హిట్ పడినా చాలని ఆయన చాలాకాలం ఎదురుచూసినా ప్రయోజనం లేకుండాపోయింది.

దాంతో ఆయన తిరిగి కమెడియన్ గా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయనను వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. కమెడియన్ గా ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ .. శ్రీను వైట్ల .. హను రాఘవపూడి సినిమాల్లో చేస్తున్నాడు. పారితోషికంగా ఆయన ఇప్పుడు రోజుకు 4 లక్షలు అందుకుంటున్నాడట. ప్రస్తుతానికి ఒక్క వెన్నెల కిషోర్ మినహా మిగతా కమెడియన్స్ అంతగా ప్రభావం చూపలేకపోతుండటం వలన సునీల్ కి మళ్లీ కలిసొచ్చిందని చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here