టీమిండియా మాజీ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లకు సంబంధించిన ఓ ఫొటో బాగా అలరిస్తోంది. తాజాగా సెహ్వాగ్‌ ఆ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ… ‘సచిన్‌ రాముడైతే.. నేను హనుమంతుడిని’ అని పేర్కొన్నారు.

‘దేవుడితో ఉన్నప్పుడు.. అతడి పాదాల వద్ద ఉండటం బాగుంది’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. అప్పట్లో వీరిద్దరూ చాలా మ్యాచుల్లో ఓపెనర్లుగా మైదానంలోకి వచ్చి పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. మొత్తం 93 వన్డేల్లో వీరిద్దరు ఓపెనర్లుగా దిగి 42.13 సగటుతో 3,919 పరుగులు సాధించారు. వీరిద్దరి మధ్య ఉండే అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది. ఎంతో వినమ్రతతో సెహ్వాగ్‌ చేసిన ఈ పోస్ట్‌ బాగా వైరల్ అవుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here