అసెంబ్లీ స్పీకర్ కు తప్పిన ప్రమాదం …

0
227

తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో ప్రమాదం తప్పింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గణపురం నుంచి భూపాల పల్లికి వెళ్తుండగా స్పీకర్ ఎస్కార్ట్ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దేవాదుల ప్రాజెక్టు పనుల నిమిత్తం పైపులను తీసుకు వెళ్తున్న లారీ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టడంతో ఆ వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్పీకర్ మధుసూదనాచారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు మధుసూదనాచారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చారు. ఈ ప్రమాదంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ సంఘటన జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here