సినీనటుడు విశాల్ సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నాడు. ఒట్టి మాటలు చెబుతూ ఊదరకొట్టకుండా ప్రజలకు గట్టిమేలు తలపెట్టేలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే పలు సందర్భాల్లో తన ఔదర్యాన్ని చూపిన విశాల్ తాజాగా మరో మంచి పని చేయడానికి సిద్ధమయ్యాడు. అది కూడా తెలుగు రాష్ట్రాల రైతుల కోసం.
ఇటీవల విడుదలైన ఆయన సినిమా ‘అభిమన్యుడు’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఇక్కడ సాధించిన వసూళ్లలో కొంత లాభాన్ని రైతులకు పంచాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి టికెట్‌పై ఒక్కో రూపాయి చొప్పున రైతులకు ఇస్తానని చెప్పాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి వారంలో రూ.12 కోట్లు వసూలు చేసింది.