104370405

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగా నాలుగేళ్ళు . ఈ నేపధ్యంలో చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై వైసీపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది . హైదరాబాద్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేత వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ తాము విడుదల చేసిన చార్జ్ షీట్ , టీడీపీ మ్యానిఫెస్టోలను దగ్గర పెట్టుకొని సరిచూసుకోవాలని ,ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని , ఎన్నికల ప్రచార సమయంలో తాను అధికారంలోకి రాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ ఫైల్ పై సంతకం పెడతానని చంద్రబాబు ఊదరగోట్టారన్నారు .  ఏపీకి ప్రత్యేకహోదా తెస్తామని చెప్పిన చంద్రబాబు చతికిల పడ్డారని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు విషయమై కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారని వ్యాఖ్యానించారు . ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాలను చంద్రబాబు పెంచి పోషించారని, బాబు పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయని విమర్శించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments