వాట్సాప్ కొత్త ఫీచర్ …

834

మనము ఎక్కువగ్గా వాడే అప్లికేషన్స్ లో వాట్సాప్ ముందు వరసలో ఉంటుంది . ఈ యాప్ కు సంబంధించి తరచూ ఎదో ఒక అప్డేట్ వెలువడుతూ ఉంటాయి . ఇప్పుడు తాజాగా  వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ను ఆండ్రాయిడ్ బీటా  వెర్షన్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఏమిటంటే ఎప్పుడైనా మెస్సేజ్ ను మరొకరికి ఫార్వార్డ్ చేస్తే ఆ మెస్సేజ్ ఇప్పుడైతే సాధారణ మెస్సేజ్ లతో కలిసిపోయి ఉంటుంది. కానీ, కొత్త ఫీచర్ లో ఫార్వార్డ్ లేబుల్ తో కనిపిస్తుంది. సాధారణ సందేశాలకు, ఫార్వార్డ్ మెస్సేజ్ లకు మధ్య భేదాన్ని స్పష్టంగా గుర్తించేందుకు గాను ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది.

ప్రస్తుతం ఇది కేవలం బీటా వెర్షన్ లోనే ఉండగా, త్వరలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెగ్యులర్ వెర్షన్ లో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ పై వాట్సాప్ కొన్ని నెలలుగా పనిచేస్తోందని సమాచారం. ఫార్వార్డ్ చేసిన మెస్సేజ్ లేబుల్ తో పాటు సింబల్ రూపంలో కనిపించడమే ఈ ఫీచర్ ప్రత్యేకత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here