ఏపీ సిఎం చంద్రబాబు చేపడుతున్న నవనిర్మాణ దీక్షపై బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు . ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణ దీక్షల పేరుతో అసత్యాలను చెబుతూ , ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు  . ఈ దీక్షల కారణంగా ఉద్యోగులు కార్యాలయాల్లో లేకపోవడంతో ప్రజా సమస్యలను పట్టించుకునేవారే లేరని , రాష్ట్రంలో పాలన స్థంబించిపోయిందని అన్నారు . 2014 బీజేపీ , జనసేనల వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని మరో సారి గుర్తుచేశారు .

తన కుమారుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసి , తాను ప్రధాని అయ్యే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని సోము వీర్రాజు అన్నారు . నరేంద్ర మోదీని ప్రజలే ఎన్నుకున్నారని ,అంతేగానీ చంద్రబాబును ఎవరూ ప్రధాని కావాలని కోరుకోలేదన్నారు . మోదీకు , చంద్రబాబుకు ఈ విషయంలో అసలు పోలీకే లేదన్నారు . ఇన్నాళ్ళు మిత్రపక్షంగా టీడీపీ ఉన్నప్పటికీ బీజీపీ గెలుపుకు ఎన్నడూ ఏమాత్రం సహకరించలేదని తెలిపారు . ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు వంటి కుత్రపూరితమైన రాజకీయ నాయకుడు దేశంలోనే లేరని అన్నారు . ఏపీలో బీజేపీ చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శిస్తున్నారనన్నారు . మళ్ళీ ఇప్పుడు తాజాగా టీడీపీ కాంగ్రెస్ తో జత కట్టేందుకు సిద్ధపడుతోందని ఎగ్దేవా చేశారు . టీడీపీ లాంటి పార్టీలకు బీజేపీ భయపడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments