తిరుపతిలో శనివారం పీఠాధిపతుల సమావేశం జరగనుందని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి తెలిపారు . శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా తిరుమలపై జరుగుతున్న పరిణామాలపై పీఠాధిపతులు తీవ్ర విస్మయం చెందారన్నారు . అంతేగాక శ్రీవారి భక్తుల్లో కూడా తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు . రేపు తిరుపతిలో జరిగే పీఠాధిపతుల సమావేశానంతరం నష్టనివారణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం ముందు ఉంచుతామని పరిపూర్ణానంద స్వామి తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments