తెలుగు సినిమాలలో భారీ సెట్స్ కు పెట్టింగ్ పేరు దర్శకుడు రాజమౌళి . గతంలో ఆయన రామోజీ ఫిలిం సిటీ లో బాహుబలి సెట్స్ అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసినదే . అయితే తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిస్తామని రాజమౌళి ప్రకటించారు . అయితే దీనికి సంబంధించిన పనులను వేగవంతం చేసే పనిలో పడ్డారట జక్కన్న . ప్రస్తుతం ఈ చిత్రానికి గచ్చిబౌలి లోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణం గా చెప్పుకునే విశాలమైన స్థలంలో ఆర్ట్ దిరేక్ట్రో సాబు సిరిల్ పర్యవేక్షణలో సెట్స్ ను రూపొందిస్తున్నారు . ఈ ప్రాంగణాన్ని నిర్మాతలు 2 సంవత్సరాలకు  లీజ్ కు తీసుకున్నట్టు సమాచారం . అయితే ఈ సినిమాలో కధానాయికలు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments