జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రజా పోరాట యాత్రలో భాగంగా నేడు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట పర్యటన చేశారు . ఈ సందర్భంగా అక్కడ బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా పై ఇప్పటికి 36 సార్లు మాట మార్చారన్నారు . అక్కడ ఉన్న స్థానిక సమస్యలను గూర్చి ప్రస్తావిస్తూ సామాజిక వెనుకబాటు తనాన్ని ప్రజల్లోకి తన పదునైన రచనలతో తీసుకెళ్ళిన గురజాడ అప్పారావు జన్మించిన చోట అక్షరాస్యత తక్కువగా ఉండడం పై ఆవేదన వ్యక్తం చేశారు . టీడీపీ హయాంలో భూ కబ్జాలు ఎక్కువైపోయాయని , టీడీపీ మంత్రులు ,ఎమ్మెల్యేలు , స్థానిక నేతలు నదులను సైతం కబ్జా చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు . విశాఖపట్నం – చెన్నై కారిడార్ పేరుతో వేల ఎకరాలు సేకరించారని , పరిశ్రమల కోసం భూతద్దం వేసి భూమి దొరకడం లేదని విమర్శించారు .

ఇంకా మాట్లాడుతూ ఆ ప్రాంతంలో వెనుకబడిన వర్గాల అభివృద్దిపై ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టటం లేదని , ఎక్కడ అభివృద్ధి అనేది కనిపించడం లేదన్నారు . గతంలో పాయకరావుపేట లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇచ్చిన హామీ మాట ఏమైందని , ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు . ఉత్తరాంధ్రలో వైద్య , విద్యా వ్యవస్థ వెనక బడి నిద్రావస్థలో ఉందని ఆవేదన వ్యక్తంచేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments