సంపర్క్ ఫర్ సమర్ధన్ పేరిట బీజేపీ ప్రచార కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసినదే . ఈ కార్యక్రమం పేరిటే ఇప్పటికే పలువు ప్రముఖులను బీజేపీ నేతలు కలిసారు . ఈ కలయికలలో బీజేపీ ఈ నాలుగేళ్ళల్లో ప్రధాన నరేంద్ర మోదీ ఆధ్వర్యం సాదించిన విజయాలను వివరిస్తున్నారు . తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ముంబై లోని బాంద్రాలో ఉన్న సల్మాన్ నివాసంలో కలుసుకున్నారు . ఈ సందర్భంగా మంత్రి నితిన్ గడ్కరీ సల్మాన్ ఖాన్ మరియు ఆయన తండ్రి సలీం ఖాన్ తో సమావేశమయ్యారు . ఈ సందర్భంగా ఈ నాలుగేళ్ళలో ఎన్డీయే కూటమి సాదించిన విజయాలను కూలంకుషంగా వివరించారు . అలాగే దానికి సంబందించిన ఒక బుక్ లేట్ ను కూడా గడ్కరీ సల్మాన్ కు అందజేశారు . ఈ విషయాన్ని నితిన్ గడ్కరీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలతో పంచుకున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments