వైసీపీ అధినేత జగన్ ను తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు నిన్న లోటస్ పాండ్ లో కలుసుకున్న విషయం తెలిసినదే . అయితే ఈ విషయం పై చంద్రబాబు స్పందించారు . ఆయన మాట్లాడుతా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే తనకేంటి సంబంధమని ప్రశ్నించారు . టీటీడీ ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని , చివరికి దేవుడి పేరిట కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు . ఇంకా మాట్లాడుతూ తిరుమల పుణ్యక్షత్రం యొక్క పవిత్రతను దెబ్బ తీయాలని చూస్తే క్షమించేది లేదని హెచ్చరించారు . టీటీడీ విభేదాల నేపథ్యంలో రమణదీక్షితులు జగన్ ను లోటస్ పాండ్ లో కలిసి చర్చించింది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments