ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వారి ఆలయం ఎదుట పెను ప్రమాదం తప్పింది . వివరాలలోకి వెళితే ఆలయం కార్ పార్కింగ్ వద్ద విజిలన్సు డీఎస్పీ అంకయ్య కారు నుండి ఉన్నట్టుండి మంటలు ఎగసిపడ్డాయి , అదే సమయంలో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది . కార్ బ్యాటరీలో లోపం కారణంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగినట్టు ఆలయ అధికారులు గుర్తించారు . పెను ప్రమాదం తప్పడంతో ఆలయ అధికారులు , భక్తులు ఊపిరి పీల్చుకున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments