కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు కధానాయకుడిగా విడుదలైన రెండో సినిమా భరత్ అనే నేను . ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 50 రోజులు . ఈ సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది . మహేష్ , కొరటాల సినిమా కెరీర్లో ఈ సినిమా ఒక చెప్పుకోదగిన విషయం గా నిలిచింది . దాదాపు 200 కోట్ల గ్రాస్ సాదించి మహేష్ బాబు కెరీర్లో 100 కోట్ల షేర్ ను రాబట్టిన తోలిచిత్రంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది .

అయితే ఇప్పుడు ఈ సినిమా మరో రికార్డు నెలకొల్పింది . ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ హక్కులను ఒక ప్రముఖ ఛానల్ దాదాపు 22 కోట్లు వెచ్చించి కైవసం చేసుకుందట . అత్యధిక ధరకు అమ్ముడుబోయిన సినిమాలలో బాహుబలి తరువాత భరత్ అనే నేను సినిమా నిలిచింది . ఈ చిత్రానికి ముఖ్యంగా మహేష్ నటన , కొరటాల దర్శకత్వాం , దేవిశ్రీ సంగీతం ప్లస్ పాయింట్స్ గా నిలిచి ఇంతటి విజయానికి దోహద పడ్డాయి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments