అలా జరిగితే జగనే సిఎం …

644

వైఎస్ఆర్సీపీ నేత , మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గుంటూరులో మీడియాతో మాట్లాడారు . ఆయన మాట్లాడుతూ రాజీనామా అనే పదం చిన్నది కాదని . దాని పర్యవసానం చాలా పెద్దదని అన్నారు . అయినప్పటికీ ఏపీ ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారన్నారు . ఏపీకి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా రాజీనామా చేసిన ఎంపీలను ప్రజలు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని అన్నారు . ఇంకా మాట్లాడుతూ  2014 లో ఎన్నికల లెక్కింపు సమయంలో టీడీపీ నేతలు ఎంత దారుణానికి పాల్పడ్డారో రాష్ట్రం మొత్తం చూసిందన్నారు . తన నియోజికవర్గం లో నాలుగు సార్లు రీ కౌంటింగ్ చేసినా తానే గెలుపొందానని , ప్రజల మద్దత్తు తనవైపు ఉండడం వల్లనే విజయం సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు . ఆ సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు గట్టిగా నిలబడడం వాళ్ళ ఫలితాలలో ఎలాంటి మార్పులు రాలేదన్నారు . అందుకే ప్రతీ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు , కౌంటింగ్ ఏజెంట్లు పాత్ర చాలా కీలకమని అభిప్రాయపడ్డారు . ఇదే పరిస్థితి మొత్తం 175 నియోజికవర్గాలలో ఉంటె కనుక వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని ఆర్కే జోస్యం చెప్పారు . ఎమ్మెల్యేలను , ఎంపీలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు ఏజెంట్లను కొనడం పెద్ద కష్టం కాదని , అలాంటి కుయుక్తులను ఎదుర్కొనేలా వ్యవహరించాలంటూ వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆర్కీ పిలుపునిచ్చారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here